బిఆర్ఎస్ అధ్యక్షుడు జోడు శ్రీనివాస్ అరెస్టుపై ఎస్పీ విచారణ జరపాలి
– బలహీన వర్గాల ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు శ్రీధర్ బాబు కుట్రలు
– కాటారంలో మార్పు వస్తే రాష్ట్రమంతా మేలుకొలుపు
– ప్రజల్లో చైతన్యం రావాలి ఎంపీ ఎమ్మెల్యేల సీట్ల కొరకు ప్రయత్నించాలి
– అప్పటివరకు నిరంతర పోరాటం మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్
కాటారం, సెప్టెంబర్30, తెలంగాణజ్యోతి: మంథని నియోజక వర్గంలో పోలీసులు టిఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ ప్రజలలో పోలీసులు అంటే చులకన భావం ఏర్పడేలా చేస్తున్నారని బిఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ తీవ్రంగా ఆరోపించారు మంగళవారం పాఠారం మండల కేంద్రం గారేపల్లి అంబేద్కర్ చౌరస్తాలో మాట్లాడారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పోలీసులు కాకి డ్రెస్ వేసుకొని నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని అందుకే కాకి దుస్తులు ధరించిన వెంకన్న పారిశుద్ధ్య కార్మికుడు ఎంత నిజాయితీగా ఉంటున్నారో అతనికి చౌరస్తాలో పాదాలు కడిగి పూలదండ వేసి పుట్ట మధుకర్ పౌర సన్మానం చేశారు. కాటారం సిఐ నాగార్జున రావు తాగిన మైకంలో టిఆర్ఎస్ అధ్యక్షుడు జోటు శ్రీనివాస్ ఇంటికెళ్ళి ఆదివారం అర్ధరాత్రి అక్రమ అరెస్టు చేశారని, ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేసి సీఐపై కేసు నమోదు చేయాలని జిల్లా ఎస్పీని పుట్ట మధుకర్ డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగం ప్రకారం నియమితులైన పోలీసులు చట్టవిరుద్ధంగా విధులు నిర్వహిస్తున్నారని, వారి మెప్పుకోసం ఇలాంటి ప్రయత్నాలు చేసినా రాబోయే కాలంలో ఎక్కడ విధులు నిర్వర్తించిన శంకరగిరి మాన్యాలు పట్టిస్తామని పుట్ట మధుకర్ హెచ్చరించారు. టిఆర్ఎస్ నాయకులపై అంచవేత ధోరణితో ఎంత ఒత్తిడితో కేసులు నమోదు చేసిన అంతే ఒత్తిడితో బయటకు వస్తూ పోలీసులు అంటే హేళన చేసే పరిస్థితి ఉందని సిగ్గుచేటని విమర్శించారు. ఎమ్మెల్యే 420 దొంగ మేనిఫెస్టో తయారుచేసిన అతనికి రాజ్యాంగం పట్ల నమ్మకం లేదని ఇక్కడే ప్రజలు చైతన్యవంతులు అయితే తన సీటుకు యసర్ వస్తుందని ఉద్దేశంతో విద్యావంతులు కానీవ్వకుండా అడ్డుపడుతున్నాడని పుట్ట మధు ఆక్షేపించారు. ఈ కార్యక్రమంలో మలహర్రావు, మహా ముత్తారం, మహాదేవపూర్, పలిమెల, కాటారం మండలంలోని బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.