చదువుతోనే సమాజ అభివృద్ధి

On: January 1, 2026 3:37 PM

చదువుతోనే సమాజ అభివృద్ధి

చదువుతోనే సమాజ అభివృద్ధి

– ఉన్నత లక్ష్యంతో విద్యార్థులు ముందుకు సాగాలి

– బిట్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎ.రాజేంద్రప్రసాద్ రెడ్డి

– ములుగులో వైభవంగా యాన్యువల్ డే సెలబ్రేషన్స్

ములుగు, డిసెంబర్ 31, తెలంగాణ జ్యోతి : చదువుతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని, పేదోడు కూడా ఉన్నత కొలువులు సాధించడానికి విద్య మాత్రమే సాధనమని బిట్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎ.రాజేంద్ర ప్రసాద్ రెడ్డి అన్నారు. మంగళవారం ములుగులోని బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ ప్రాంగణంలో హైస్కూల్, ప్రైమరీ స్కూల్స్ ప్రిన్సిపల్స్ కొలగాని రజినీకాంత్, గిరిగాని కవితల ఆధ్వర్యంలో జరిగిన వార్షికోత్సవం లో ఆయన పాల్గొని మాట్లాడారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనుకునే సంకల్పాన్ని తాము నెరవేర్చుతు న్నామని, పిల్లలతో ప్రతీ తల్లిదండ్రి స్నేహపూర్వకంగా మాట్లాడాలన్నారు. గ్రామీణ వాతావరణంలో చదువు కష్టంతో కూడుకున్నదని, ఆ కష్టానికి తగ్గట్టు ప్రతిఫలాన్ని అందించేందుకు తమ ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయుల కృషి మరువలేనిదన్నారు. నిత్యం పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేస్తూ విద్యార్థులలో ఉన్న లోపాలను గుర్తిస్తూ వారిని తీర్చిదిద్దే కార్యక్రమం జరుగుతుందన్నారు. తమ సంకల్పానికి తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. విద్యార్థుల్లో పోటీ తత్వం అవసరమని, అలాంటప్పుడే ఏదో ఒక రంగంలో రాణిస్తారన్నారు. చదువు అన్నింటికీ మూలమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద, సినీ గీతాల నృత్యాలు అలరించాయి. వెంకటాపూర్కు చెందిన ఆర్టిస్ట్ చేసిన మిమిక్రీ అలరించింది.ఈ సందర్భంగా టెన్త్, నవోదయ లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిట్స్ విద్యాసంస్థల డైరెక్టర్ రాజేశ్వర్ రెడ్డి, వనజా రెడ్డి, ఉపాధ్యాయులు మాసపాక శ్రీధర్, పూర్ణేందర్, రాజేష్, స్వర్ణలత, తాజ్ బేగం, సుష్మ, తదితరులు పాల్గొన్నారు.

చదువుతోనే సమాజ అభివృద్ధి

చదువుతోనే సమాజ అభివృద్ధి

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!