స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా సిరిసిల్ల రాజయ్య
హైదరాబాద్, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య నియామక మయ్యారు.చైర్మన్‌తో పాటు సభ్యులుగా ఎం రమేశ్, సంకేపల్లి సుధీర్‌రెడ్డి, మాలోత్ నెహ్రూ నాయక్ ను నియమిస్తూ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ శుక్ర వారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిషన్ చైర్మన్‌తో పాటు సభ్యులు రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.