కృష్ణకాలనీ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సై వెంకటేశ్వర్లు
ములుగు, ఆగస్టు 31, తెలంగాణ జ్యోతి : గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ములుగు జిల్లా కృష్ణ కాలనీ లో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎస్సై వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన భక్తులకు వడ్డించి, ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రాజిరెడ్డి, తడక సుధాకర్, మోహన్, నవీన్, నరేష్, తిరుపతి, కాలనీ వాసులు పాల్గొన్నారు.