నాంచారమ్మ జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఎస్ఐ సతీష్

నాంచారమ్మ జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఎస్ఐ సతీష్

వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి: మండలంలోని రామానుజ పూర్ గ్రామ సమీపంలోని పంట పొలాల మధ్య ఉన్న ఎరుకల నాంచారమ్మ ఆలయంలో ఈనెల 12 నుంచి వారం రోజులపాటు జాతర జరగనుండగా శనివారం ఎస్సై జక్కుల సతీష్, ట్రైనీ ఎస్సై జగదీశ్వర్ రెడ్డి లు జాతర ఏర్పాట్లను పరిశీలించారు. జాతరకు మంత్రి సీతక్క తో పాటు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావులు వచ్చేఅవకాశాలు ఉండడంతో ముందు జాగ్రత్తగా ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్సై జక్కుల సతీష్ మాట్లాడారు. జాతరకు తరలివచ్చే భక్తుల కోసం సౌకర్యాలను కల్పించాలని ఉత్సవ కమిటీ చైర్మన్, తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజుకు సూచించారు.అవాంఛనీయ సంఘట నలు జరకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. భక్తిశ్రద్ధలతో నాంచారమ్మ జాతరను జరుపుకోవాలని, భక్తులు పోలీసులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీల కు ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఉత్సవ కమిటీ చైర్మన్ లోకిని రాజు ములుగు జిల్లా అధ్యక్షుడు, కేతిరి బిక్షపతి, ఉత్సవ కమిటీ డైరెక్టర్లు పల్లకొండ భాస్కర్, కోనేటి రాజు, కూతాటి శ్రీనివాస్, బండి మహేష్, దేవర్ల సతీష్, దేవర్ల పరమేష్, రైతులు చిర్ర గణేష్, రామకృష్ణ తదితరులున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment