క్రీడల్లో నైపుణ్యతను చాటాలి
– కాటారం డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి
– అట్టహాసంగా ట్రస్మా క్రీడోత్సవాల ప్రారంభం
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : చదువుతో పాటు క్రీడల్లో రాణించేవారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, గెలుపోటము లతో సంబంధం లేకుండా క్రీడా స్ఫూర్తిని చాటాలని కాటారం డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి, ఆర్టీవో సంధాని లు అన్నారు. మండల కేంద్రంలోని ఆదర్శ హైస్కూల్ లో రెండ్రోజుల పాటు జరిగే ట్రస్మా సబ్ డివిజనల్ స్థాయి క్రీడా పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ట్రస్మ ఏరియా కమిటీ అధ్యక్షుడు కొట్టే శ్రీశైలం సభా అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో కాటారం డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి, ఆర్టీవో సంధాని లు క్రీడా జ్యోతిని వెలిగించి, క్రీడా జెండాను ఎగురవేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..క్రీడలతో మానసిక ఉల్లాసం, ఆరోగ్యం లభిస్తుందని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండి చదువుల్లో ఉన్నతంగా రాణించాలని తెలిపారు. ట్రస్మా ఆధ్వర్యంలో క్రీడలను ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. అంతకు ముందు మండల కేంద్రంలో క్రీడా జ్యోతితో పుర వీధుల్లో సబ్ డివిజన్ విద్యార్థులు ర్యాలీగా ఆదర్శ హైస్కూల్ క్రీడా ప్రాంగణం వరకు చేరుకున్నారు. సబ్ డివిజన్ పరిధిలోని 18 ప్రయివేట్ పాఠశాలల విద్యార్థులకు కబడ్డీ, ఖో ఖో క్రీడాంశాల్లో పోటీలు హోరాహోరీగా సాగాయి. ఈ కార్యక్రమంలో ఎస్సై అభినవ్, ట్రస్మా జిల్లా జనరల్ సెక్రటరీ సంపత్ రావు, ఉపాధ్యక్షుడు కార్తీక్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఏరియా కమిటీ కార్యదర్శి రాజబాబు, కోశాధికారి వెంకటేష్ గౌడ్, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్ రెడ్డి, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు చీమల సందీప్, టస్మా జిల్లా కార్యవర్గ సభ్యులు మంజుల, శశి, తదితరులు పాల్గోన్నారు. యం యం శశి – గుడ్ మార్నింగ్ గ్రామర్ హై స్కూల్, మహాదేవపూర్, చీర్ల శ్రీనివాస్ రెడ్డి – గ్రీన్ వుడ్ కాన్సెప్ట్ హై స్కూల్, మహాదేవపూర్, బీ మంజుల రెడ్డి – రైజింగ్ స్టార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, మహాదేవపూర్, వి సుభాష్ చంద్రబోస్ – శ్రీ శివచంద్ర విద్యా మందిర్, సూరారం, వలుస వెంకటేశ్వర్లు – వివేకానంద హై స్కూల్, గారేపల్లి, జనగామ కార్తీక్ రావు ఆదర్శ హై స్కూల్, గారెపల్లి, ఏ పృథ్వి – కేంబ్రిడ్జి హై స్కూల్, గారెపల్లి, కొట్టే శ్రీశైలం – సువిద్య హైస్కూల్, గారెపల్లి, బుర్ర వెంకటేష్ – విద్యా నికేతన్ హై స్కూల్, గారెపల్లి, మాంటిస్సోరి హై స్కూల్, గారెపల్లి, రామచంద్రారెడ్డి – గౌతమ్ మోడల్ స్కూల్, మహాముత్తారం, జే నవీన్ – శ్రీ స్పార్క్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, బోర్ల గూడెం, వి సంపత్ రావు – శ్రీ సాయి వాణి విద్యానికేతన్, తాడిచర్ల, శ్రీ వాగ్దేవి విద్యాలయం, తాడిచర్ల, కె సుదర్శనన్ – విశ్వ దీప్తి ఇంగ్లీష్ మీడియం స్కూల్, కొయ్యూరు, కె రాజు – దేవి విద్యోదయ విద్యాలయం, కొయ్యూరు, కె శశిధర్ రావు – బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్, పెద్దతూండ్ల, ఆర్ రాజబాబు – విజ్ఞాన జ్యోతి విద్యా మందిర్, రుద్రారం కరస్పాండెంట్లు పాల్గొన్నారు.