కర్లపల్లి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థికి షాక్
– ములుగు ఆస్పత్రికి తరలింపు
ములుగు ప్రతినిధి : గోవిందరావుపేట మండలం కర్లపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థికి విద్యుత్ షాక్ కొట్టడం తో ములుగు ఆస్పత్రికి తరలించారు. తాడ్వాయి మండలం బయ్యక్కపేట గ్రామానికి చెందిన నీరటి ముఖేష్ ఆశ్రమ పాఠశాలలో 9వతరగతి చదువుతున్నాడు. ఆదివారం ఉద యం విద్యార్థి ఆడుకుంటుండగా పాఠశాల భవనం గోడ కు నిర్లక్ష్యంగా వదిలేసిన విద్యుత్ వైర్ కు కరెంట్ సరఫరా కావడంతో అది తాకి ముఖేష్ షాక్ కు గురయ్యాడు. వెంటనే హాస్టల్ వార్డెన్, సిబ్బంది గమనించి 108 ద్వారా ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించ గా విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, విద్యార్థికి షాక్ కొట్ట డంపట్ల విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత నిర్లక్ష్యంగా పాఠశాల నిర్వహణ ఉందని, వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.