అక్రమంగా తరలిస్తున్న టేకు కలప పట్టివేత
రేంజ్ కార్యాలయానికి తరలింపు
వెంకటాపురం, అక్టోబర్ 17, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని ఎదిర సెక్షన్ లో అక్రమంగా టేకు దుంగలను ట్రాక్టర్ పై తరలిస్తున్న స్మగ్లర్లను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఫారెస్ట్ అధికారులకు నమ్మదగిన సమాచారం అందిన వెంటనే, వెంకటాపురం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వంశీ కృష్ణ ఎదిర సెక్షన్ అధికారులు, సిబ్బందిని శుక్రవారం తెల్లవారుజామున అప్రమత్తం చేశారు. అనంతరం కొత్తపల్లి క్రాస్ రోడ్డువద్ద అడవుల నుండి బయలుదేరిన ట్రాక్టర్ను గుర్తించారు. ట్రాక్టర్ ముందు, వెనుక భాగాల్లో మరియు ఇరువైపులా టేకు దుంగలను కట్టుకొని తరలిస్తున్న స్మగ్లర్లు ఆకస్మిక దాడి సమయంలో అడవుల్లోకి పరారయ్యారు. ట్రాక్టర్ను కలపతో సహా వెంకటాపురం ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి తరలించి సీజ్ చేశారు. ఈ ఘటనపై ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వంశీ కృష్ణ మాట్లాడుతూ, “కలపను స్వాధీనం చేసుకొని, కేసు నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నాం” అని తెలిపారు. ఈ దాడిలో ఎదిర సెక్షన్ ఆఫీసర్ జయసింగ్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు వసంత్, చంద్రమోహన్, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.