అనుమతి పత్రాలు లేని ఇసుక లారీలు సీజ్​

Written by telangana jyothi

Published on:

అనుమతి పత్రాలు లేని ఇసుక లారీలు సీజ్​

– పస్రా చెక్​ పోస్టు వద్ద స్వాధీనం చేసుకున్న ఎఫ్​ఆర్​వో

– విచారణ చేస్తున్న ఆఫీసర్లు

ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లాలో జీరో ఇసుక దందా మళ్లీ మొదలైంది. గోవిందరావుపేట మండ లం పస్రా అటవీ ప్రాంతంలోని చెక్​ పోస్టు వద్ద సరైన పత్రాలు లేకుండా వెళ్తున్న నాలుగు ఇసుక లారీలను అటవీ అధికా రులు స్వాధీనం చేసుకోవడంతో ఈవిషయం బహిర్గతమైంది. బుధవారం అర్థరాత్రి పస్రా రేంజ్​ పరిధిలోని చెక్​ పోస్టు వద్ద సెక్షన్, బీట్​ అధికారులు తనిఖీలు చేపట్టి అనుమతి పత్రాలు లేని నాలుగు లారీలను సీజ్​ చేసినట్లు పస్రా అటవీశాఖ రేంజ్​ అధికారి బాలరాజు తెలిపారు. బుధవారం రాత్రి 4 ఇసుక లారీలు ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా పస్సా చెక్పోస్ట్ వద్ద తమకు పట్టు పడ్డాయని ధృవీకరించారు. నిత్యం తనిఖీ లు చేపడుతామని, అనుమతి లేకుండా వచ్చే లారీలను సీజ్​ చేస్తామని పేర్కొన్నారు. అయితే ఈ పట్టుబడ్డ లారీలు ఏ ఇసుక క్వారీ నుంచి వచ్చాయో విచారణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now