Seetakka | కేటీఆర్ ఎందుకు తొందర..?
– బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు మంత్రి సీతక్క చురకలు
– అసలు కథ అంతా ముందున్నదని హెచ్చరిక
హైదరాబాద్, తెలంగాణ జ్యోతి : ఎందుకు అంత తొందర అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కు మంత్రి సీతక్క చురకలు అంటించారు. అప్పడే తొందర పడి విమర్శలు చేయొద్దంటూ హితవుపలికారు. అసలు కథ ముందం టూ కెటిఆర్ కు మంత్రి సీతక్క హెచ్చరించారు. మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క బుధవారం కౌంటర్ అటాక్ చేశారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజులలో కీలక హామీలు అమలు చేస్తామని మాట ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు నింద తమపై వేస్తుందంటూ కెటిఆర్ చేసిన కామెంట్స్ పై ఆమె మండి వడ్డారు. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సాధ్యం కాని హామీలు ఇచ్చా రన్న వ్యాఖ్యాలను ఆమె తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ లాబీలో ఆమె నేడు మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలకు అంత తొందర పాటువద్దన్నారు. అధికారం పోయిందన్న బాధకేటీఆర్ను వెంటాడు తోందన్నారు. అయితే తాము ఇస్తామన్న దానికి బీఆర్ ఎస్ వాళ్ళు పెంచి చెప్పారు కదా? అని ప్రశ్నించారు. కాగా.. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఒక్కో హామీని క్రమ పద్దతిలో అమలు చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. రైతులకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామ ని తెలిపారు. కాంగ్రెస్ ను గెలిపించి నందుకు ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు.