విద్యార్థులకు ఉచితంగా “ప్రజాకవి కాళోజీ” సినిమా ప్రదర్శన
ములుగు, తెలంగాణ జ్యోతి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి సహాకారం తో “ప్రజాకవి కాళోజీ ” సినిమా ను ములుగు జిల్లా కేంద్రం లోని తిరుమల కళామందిరులో ఈ నెల 23 నుండి 29 వరకు ప్రతిరోజు ఉదయం సమయంలో విద్యార్థుల కోసం ఉచితంగా ప్రదర్శించబడుతుందని సినిమా డైరెక్టర్ ప్రభాకర్ జైనీ శుక్రవారం ఒక ప్రకటన లో తెలిపారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులను విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి(ఐ.ఏ.యస్ ) ఇప్పటికే ములుగు జిల్లా డీఈఓ కు పంపించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజాకవి కాళోజీ జీవితం చరిత్ర నేటి విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఆయన పేరుతో తీసిన ఈసిని మాను విద్యార్థుల కోసం ఉచిత ప్రదర్శన చేస్తున్నామని అన్నా రు. ఈ అవకాశాన్ని జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపుని చ్చారు. జిల్లాలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు సైతం తమ తమ పాఠశాల విద్యార్థులకు ప్రజాకవి కాళోజీ సినిమా చూపించే విదంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కోరారు.