విజ్ఞాన సృష్టికి వేదికగా మారిన సైన్స్ సంబరాలు : డి ఈ ఓ
ఉల్లాసంగా, ఉత్సాహంగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ
కాటారం, డిసెంబర్ 6, తెలంగాణ జ్యోతి : భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరుగుతున్న జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన మరియు ఇన్స్పైర్ మేళా 2025 రెండవ రోజు ముగింపు సమావేశం జిల్లా విద్యాధికారి రాజేందర్ అధ్యక్షతన జరిగింది. ప్రపంచము పట్ల ఆసక్తి, సమస్యలను పరిష్కరించా లనే విద్యార్థుల్లో జ్ఞానం అభివృద్ధి చెందేందుకు సైన్స్ ఫెయిర్ కార్యక్రమాలు ద్వారా పడతాయని జిల్లా విద్యాధికారి ఎం రాజేందర్ అన్నారు. శనివారం ముగింపు సమావేశంలో మాట్లాడుతూ శాస్త్రవేత్తల పరిశోధన ద్వారా శాస్త్రం లో కొత్త జ్ఞానం అభివృద్ధి చెందుతుందని నేటి భావి శాస్త్రవేత్తలుగా ఎదగడానికి వైజ్ఞానిక ప్రదర్శన దోహదం చేస్తుందని అన్నారు. విద్యార్థుల ఉత్సాహం, సృజనాత్మకత, విజ్ఞాన పరంపరకు అద్దం పట్టింది. విద్యార్థులు తమ ప్రాజెక్టులను ప్రదర్శించి, తమ శాస్త్రీయ నైపుణ్యాలను ఆవిష్కరించారు.సైన్స్ ఫెయిర్ రెండవ రోజు వివిధ పాఠశాలల నుండి 3000 మందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు సందర్శించినట్లు భూపాలపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి యం రాజేందర్, జిల్లా సైన్స్ అధికారి బర్ల స్వామి తెలిపారు.విద్యార్థుల నైపుణ్యాలు, పరిశోధనాత్మక ఆలోచనలు, కొత్త ఆవిష్కరణలతో సైన్స్ ఫెయిర్‌కు ప్రత్యేక ఆకర్షణను తెచ్చాయని అన్నారు ప్రాజెక్టులకు తోడు విద్యార్థులు సైన్స్ అంశాల ఆధారంగా కళా ప్రదర్శనలు, సైంటిఫిక్ స్కిట్స్ కూడా ప్రదర్శించారు, ఇది కార్యక్రమానికి మరింత ఉల్లాసాన్ని తీసుకువచ్చింది. ప్రాజెక్ట్ సమాజానికి ఉపయోగకరమా? ఆవిష్కరణ ప్రజలకు తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండగలదా?దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉన్నాయా? మున్నగు అంశాలను పరిశీలించి జడ్జిలు మార్కులను కేటాయించి ఉత్తమమైన వాటిని ఎంపిక చేసారు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మరియు ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో ఇన్స్పైర్ విభాగంలో తమ ఎగ్జిబిట్ లను ప్రదర్శించారు విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని మరెన్నో ఆలోచనలతో, పరిశోధనలు చేసి జిల్లాకు మంచి పేరు తేవాలని డి ఈ ఓ రాజేందర్ అన్నారు భావి శాస్త్రవేత్తలుగా ఎదగడానికి సైన్స్ ఫేర్స్ దోహదం చేస్తాయని అన్నారు ఇన్స్పైర్ సైన్స్ ఫేర్ విజేతలకు మేమంటోల్ ప్రశంస పత్రాలు అందచేశారు ఈ కార్యక్రమం లో సైన్స్ ఫేర్ కో కన్వీనర్ సైన్స్ అధికారి బర్ల స్వామి డి సి ఈ బి సెక్రటరీ ఓ చంద్ర శేఖర్ ఏ ఎం ఓ పి విజయ్ పాల్ రెడ్డి సి ఎం ఓ సామల రమేష్, బిట్స్ ప్రిన్సిపాల్ శ్రీనివాస చారి వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రధాన బాధ్యులు ట్రస్మా బాధ్యులు సాంబయ్య శ్రీనివాస రావు సతీష్ సంపత్ రావు కార్తీక్ రావు శ్రీనివాస్ రెడ్డి రాజ్ మహ్మద్, దేవేందర్ రెడ్డి వివిధ కమిటీల కన్వీనర్ కో కన్వీనర్లు సభ్యులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. 215 ప్రాజెక్టులను, 75 ఇన్స్పైర్ ప్రదర్శనలు ప్రదర్శించినారు.





