వాజేడు హైస్కూల్ ఆధ్వర్యంలో బడిబాట
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రం లోని జిల్లా పరి షత్ ఉన్నత పాఠశాల వాజేడు నాగారం ఉపా ధ్యాయులు, ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం పాఠశాల పరిధిలోని ఆవాసాలు కాసారం, జంగాలపల్లి, నాగారంలోని సంతపాక, ఆయా పరిధిలో ఉన్న ప్రతి ఇంటింటినీ సందర్శిస్తూ విద్యార్థుల ప్రవేశాలను నమోదు చేసారు. మండల ఎంపీడీవో శ్రీకాంత్ నాయుడు,ఎంఈఓటి.వెంకటేశ్వరరావు,ఉపాధ్యాయులు గ్రామా లలోని ప్రతి ఇల్లును సందర్శించి ఉన్నత పాఠశాలలో ఉన్న సౌకర్యాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పోరిక స్వరూప్ సింగ్, నూనావత్ శ్రీకాంత్, కుమార్ బాబు తదితరులు పాల్గొన్నారు.