స్కావెంజర్స్ అసోసియేషన్ మండల కమిటీ ఎన్నిక
కన్నాయిగూడెం, జూలై 20, తెలంగాణ జ్యోతి : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల స్కావేంజర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు యణమల్ల ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మండల కమిటీ ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా శ్రీరాముల లక్ష్మి, ఉపాధ్యక్షులు సమ్మెట రాజేశ్వరి, ప్రధాన కార్యదర్శి ఆలం అనితలు ఎన్నికయ్యారు. అనంతరం మండల అధ్యక్షులు శ్రీరాముల లక్ష్మీ మాట్లాడుతూ… ప్రతి పాఠశాలలో పనిచేస్తున్న స్కావెంజర్లను పేరు నమోదు చేసి రిజిస్టర్ పెట్టాలని, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. ఈ సమావేశానికి తోట నవీన్,టి సమ్మయ్య, బి.ఉత్తర, వి. తిరుమల,స్వప్న ,రమా, బానక్క, కృష్ణవేణి, కౌసల్య, దుర్గయ్య, మల్లయ్య, వి మహేష్ సభ్యులు పాల్గొన్నారు.