లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ లో వైభవంగా సంక్రాతి సంబరాలు
ములుగు, తెలంగాణ జ్యోతి : జిల్లా కేంద్రం లోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ లో గురువారం సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమములో విద్యార్థులు రంగ వల్లికలతో, హరిదాసు రూపాలతో , భోగి మంటలతో వివిధ రకాల వేషాధారణలతో నృత్య ప్రదర్శనలు చేస్తూ,గాలి పటాలు ఎగురవేస్తు పండగ వాతావరణం నెలకోల్పారు. ఈ సదర్భంగా పాఠశాల ఉప ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ గ్రేస్ టోప్నో మాట్లాడుతూ తెలుగు వారి ఆచార వ్యవహారాల సంపద సంక్రాంతి అని, రైతులు పంటలు బాగా పండించి చేతికి వచ్చిన తరుణాల్లో పండగను అందరూ సంతోషంగా జరుపుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో రంగవల్లిక లలో ప్రతిభ కనబర్చిన విద్యా ర్థులకు సిస్టర్ గ్రేస్, వ్యాయామ ఉపాధ్యాయుడు బస్వోజు రమణాచారి, లక్ష్మణ్, కృష్ణ, రహిమ, ప్రియాంక, నరసింహారా వు లు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మధు సుధనాచారి, హైమావతి, అఫ్రీనా భేగం,సిస్టర్ లిల్లీ, మాధవి, సిస్టర్ శైని,పద్మ, ఆశాంజలి, ఉపాధ్యాయులు, విద్యార్దులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.