వెంకటాపూర్ మండల వ్యవసాయ అధికారిగా శైలజ
వెంకటాపూర్ : వెంకటాపూర్ మండల వ్యవసాయ అధికారి ఎం కళ్యాణి బదిలీపై వెళ్లగా ఆస్థానంలో నూతన మండల వ్యవసాయ అధికారిగా మడురి శైలజ మంగళవారం బాధ్యత లను చేపట్టారు. ఈ సందర్భంగా మంగళవారం పాలంపేట రైతు వేదిక లో రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొని రైతులకు రుణమాఫీ పై ఉన్న సమస్యలను వివరించారు. బుధవారం నుండి వెంకటా పూర్ మండల రైతు వేదికలో రుణమాఫీ పై సహాయ కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా పాలంపేట, నల్లగుంట నూతన వ్యవసాయ విస్తీర్ణ అధికారు లు కుమార్, మహి పవన్ బదిలీపై రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవి పేట ఏఈఓ డయాన, రైతులు పాల్గొన్నారు.