లక్ష్మీదేవిపేటలో ఘనంగా సద్దుల బతుకమ్మ

లక్ష్మీదేవిపేటలో ఘనంగా సద్దుల బతుకమ్మ

లక్ష్మీదేవిపేటలో ఘనంగా సద్దుల బతుకమ్మ

వెంకటాపూర్, సెప్టెంబర్ 29, తెలంగాణ జ్యోతి : మండలం లోని ఉమ్మడి లక్ష్మీదేవి పేట, లక్ష్మీపురం, నర్సింగాపూర్ గ్రామాలలో మహిళలు సద్దుల బతుకమ్మను ఘనంగా జరుపుకున్నారు. ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు ఆధ్వర్యంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ చుట్టూ ఆటపాటలతో సందడి చేశారు. గ్రామాల వద్ద ఉన్న మారేడు గొండ చెరువు, తుమ్మలకుంట వద్ద మహిళలు బతుకమ్మ పేర్చి సాంప్రదాయ గీతాలతో ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా పెద్దలు, కార్యదర్శులు బతుకమ్మ పేర్చిన విధానాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవి పేట కార్యదర్శి నాగరాజు, నర్సింగాపూర్ కార్యదర్శి అనిత, లక్ష్మీపురం కార్యదర్శి రజితతో పాటు గోస్కుల లక్ష్మణ్, వాక్య, కార్తీక్, గ్రామాల ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

లక్ష్మీదేవిపేటలో ఘనంగా సద్దుల బతుకమ్మ

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment