వెంకటాపురంలో ఘనంగా రన్ ఫర్ జీసస్ ర్యాలీ

On: April 4, 2026 5:14 PM

వెంకటాపురంలో ఘనంగా రన్ ఫర్ జీసస్ ర్యాలీ

వెంకటాపురంలో ఘనంగా రన్ ఫర్ జీసస్ ర్యాలీ

వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 4, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సందర్భంగా జీసస్ సర్వెంట్ పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం రన్ ఫర్ జీసస్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీని వెంకటాపురం ఎస్ఐ తిరుపతిరెడ్డి జండా ఊపి ప్రారంభించగా, గ్రోమోర్ కంపెనీ నుండి ప్రధాన రహదారి మీదుగా మార్కెట్ యార్డ్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు ముర్రం డేవిడ్ మాట్లాడుతూ మానవాళి రక్షణ కోసం యేసుక్రీస్తు జన్మించారని, ప్రేమ, కరుణ భావాలతో అందరూ జీవించాలని సూచించారు. యేసు ప్రభువు చేసిన త్యాగాలను కొనియాడు తూ ఆయన జీవితం మానవాళికి ఆదర్శమని తెలిపారు. ఈ ర్యాలీలో మండల కేంద్రానికి చెందిన క్రైస్తవ సహోదరులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మండల ఫెలోషిప్ కార్యదర్శి కే డానియల్, కోశాధికారి సిహెచ్ కొర్నిల్, ఇతర సేవకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!