ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆర్టీసీ బస్సు రవాణా ఏర్పాటు చేయాలి

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆర్టీసీ బస్సు రవాణా ఏర్పాటు చేయాలి

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆర్టీసీ బస్సు రవాణా ఏర్పాటు చేయాలి

– వాజేడు తహసీల్దార్‌కు ఎస్టీ జేఏసీ వినతి

వెంకటాపురం, జూలై9, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ మండల కమిటీ సభ్యులు బుధవారం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో 22 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారని, వీరిలో 90 శాతం మంది విద్యార్థులు పాఠశాలలకు దూర ప్రాంతాల నుండి ప్రయాణిస్తూ విద్యను కొనసాగిస్తున్నారన్నారు. విద్యార్థుల రాకపోకలలో ఏర్పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఆర్టీసీ బస్సు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జేఏసీ సభ్యులు డిమాండ్ చేశారు. దీనివల్ల విద్యార్థుల సమయంతో పాటు శక్తి కూడా ఆదా అయ్యి, చదువుపై మరింత శ్రద్ధ పెరుగుతుందన్నారు. పాఠశాలలను సెమి రెసిడెన్షియల్ మోడల్‌గా అభివృద్ధి చేసే దిశగా ఇది తొలి అడుగవుతుందని జేఏసీ సభ్యులు అభిప్రాయ పడ్డారు. విద్యార్థుల ప్రయాణ సౌకర్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని వారు ములుగు జిల్లా కలెక్టర్, వాజేడు తహసీల్దార్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు చిరంజీవి మహారాజ్, సమ్మయ్య నాయక్, రాజు, వినీత్, సందీప్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆర్టీసీ బస్సు రవాణా ఏర్పాటు చేయాలి

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment