స్టాక్ ట్రేడింగ్ పేరుతో రూ.12 లక్షలు స్వాహా

స్టాక్ ట్రేడింగ్ పేరుతో రూ.12 లక్షలు స్వాహా

కాటారం, జూలై 03,తెలంగాణ జ్యోతి : స్టాక్ ట్రేడింగ్ పేరిట రూ.12 లక్షలు దోచేశారంటూ ఓ బాధితుడు భూపాలపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కృష్ణకాలనీకి చెందిన ఒక ఉద్యోగికి వాట్సాప్ ద్వారా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అడ్వైసర్ల మంటూ కావ్య, సంధ్య అనే మహిళలు సంప్రదించి పెట్టుబడి ప్రణాళికను వివరించారు. మీరు కేవలం 15 రోజులలో 50 శాతం లాభాలు సాధించవచ్చునని నమ్మించారు. దీంతో ఆశపడిన బాధితుడు మొదట రూ. 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాడు. దానికి వచ్చిన లాభాన్ని ఇచ్చారు. ఆతర్వాత భాదితుడు దశలవారీగా రూ.12 లక్షలు పెట్టేశాడు. తరువాత వారి వాట్సాప్ నెంబర్లని మార్చివేశారు. దీనితో బాధితుడు భూపాలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయాగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని సి ఐనరేశ్ కుమార్ తెలిపారు. అదే విధంగా ఫేక్ డిపి ల ద్వారా సోషల్ మీడియాలో అకౌంట్ క్రియేట్ చేసి ఆపదలో ఉన్నామని మెసేజెస్ పెట్టీ డబ్బులు అడుగుతారని, మీషోలో ఆఫర్ పేరిట బురిడి కొట్టించి డబ్బులు కాజేస్తున్నారని, డిజిటల్ అరెస్ట్ పేరిట మోసాలకు పాల్పడు తున్నారని, పి ఎం కిసాన్ యోజన పేరిట ఏ పి కే ఫైల్స్ ని వాట్సాప్ గ్రూపుల్లో పంపిం మొబైల్స్ ను హక్ చేసి డబ్బులు కాజేస్తున్నారని వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సి ఐ నరేష్ సూచించారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment