వెంకటాపురం – భద్రాచలం రహదారి మరమ్మతులకు రూ.100 కోట్లు కేటాయించాలి 

వెంకటాపురం – భద్రాచలం రహదారి మరమ్మతులకు రూ.100 కోట్లు కేటాయించాలి 

వెంకటాపురం – భద్రాచలం రహదారి మరమ్మతులకు రూ.100 కోట్లు కేటాయించాలి 

వెంకటాపురం, సెప్టెంబర్7, తెలంగాణ జ్యోతి: వెంకటాపురం – భద్రాచలం ప్రధాన రహదారి మరమ్మత్తులకు రూ.100 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం పాదయాత్ర నిర్వహించారు. యాకన్నగూడెం నుండి 32 కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్ర వెంకటాపురం మండల కేంద్రానికి చేరుకుంది. వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్న ఈ యాత్ర ముగింపు సభ స్థానిక అంబేద్కర్ సెంటర్లో జరిగింది. మాజీ ఎమ్మెల్యే, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ – కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్ పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినా, గిరిజన ప్రాంత ప్రజలకు రవాణా సౌకర్యాలపై కనీస శ్రద్ధ చూపలేదని విమర్శించారు. ఇసుక లారీలు వందల టన్నుల బరువుతో రాకపోకలు సాగించడంతో రహదారి ధ్వంసమై ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతు న్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిరోజూ ఇసుక రవాణా ద్వారా ప్రభుత్వానికి కోటికి పైగా ఆదాయం వస్తోందని, కానీ ఆ ఆదాయంలో కొంత కూడా ఏజెన్సీ ప్రాంత రోడ్ల మరమ్మతులకు కేటాయించకపోవడం విడ్డూరమని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎర్రజెండా నిరంతరం పోరాడుతుందని, పదవులు సిపిఎంకు ముఖ్యం కావని రంగా రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి, ములుగు జిల్లా కార్యదర్శి బి.రెడ్డి సాంబశివ, మండల కార్యదర్శి గ్యానం వాసు, జిల్లా కమిటీ సభ్యులు కుమ్మరి శ్రీను, వంకా రాములు, చారి, జజ్జరి దామోదర్, సాధనపల్లి దేవమణి, పరిశిక రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment