క్షేమంగా చేరుకోవాలంటే రోడ్డు భద్రత తప్పనిసరి
‘ఎరీవ్ ఎ లైవ్’ కార్యక్రమంలో డ్రైవర్లకు అవగాహన
వెంకటాపురం, మార్చి 21, తెలంగాణ జ్యోతి: ఇంటి నుండి బయటకు వెళ్లిన ప్రతి వ్యక్తి క్షేమంగా తిరిగి ఇంటికి చేరుకోవాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీస్ శాఖ సంయుక్తంగా చేపట్టిన ‘ఎరీవ్ ఎ లైవ్’ కార్యక్రమం ముఖ్యమని ములుగు జిల్లా వెంకటాపురం పిఎస్ఐ తిరుపతి రెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్‌లో ఇంధన శకట వాహనదారులు, డ్రైవర్లకు ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ బాధ్యతాయుతంగా ప్రయాణించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.





