కాళేశ్వరంలో మహ కుంభాభిషేకం, సరస్వతి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష : కలెక్టర్ రాహుల్ శర్మ 

Written by telangana jyothi

Published on:

కాళేశ్వరంలో మహ కుంభాభిషేకం, సరస్వతి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష : కలెక్టర్ రాహుల్ శర్మ 

కాళేశ్వరం,తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం లో మే15 నుండి 26 వరకు జరుగు సరస్వతీ పుష్కరాలు ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో జరిగే మహా కుంభాభిషేకం కార్యక్రమాలు నిర్వహణ,ఆలయ అభివృద్ధి పనులపై శుక్రవారం కాళేశ్వరం ఈఓ కార్యాలయంలో దేవస్థానం, పోలీస్, రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, వైద్య శాఖల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ కాళేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే మహా కుంభాభిషేకానికి సుమారు 20 వేల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. గోపురం పనులు పూర్తి చేయాలని దేవస్థానం అధికారులను ఆదేశించా రు. సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగ కుండా మరుగుదొడ్లు, లైటింగ్, దుస్తులు మార్చుకొకు గదులు, స్నానాలు చేయడానికి కుళాయిలు, ఘాట్స్, రహదారుల మర మ్మతులు, వాహనాల పార్కింగ్ స్థలాల ఏర్పాట్లపై అధికారులకు చేయాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారు. పెండింగ్ ఉన్న పనుల ను అన్ని‌ శాఖల అధికారులతో సమన్వయంతో త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. పుష్కరాల నిర్వహణకు అన్ని శాఖల అధికారులు మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని సూచిం చారు. చేపట్టాల్సిన పనులకు సంబంధించి ఇచ్చిన నివేదికల్లో మార్పులు, చేర్పులు ఉంటే ప్రతిపాదనలు పంపాలని సూచిం చారు. సరస్వతి పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు ఏప్రిల్ 30వ తేది వరకు పూర్తి చేయాలని అధికారులను అదేశించారు. అన్ని శాఖ ల అధికారులు ఇచ్చిన నివేదికలు ఆధారంగా తయారు చేసిన ప్రణాళికలపై ఆర్కిటెక్చర్ జి.ఎస్.వి సూర్యనారాయణ మూర్తి వివరించారు. మే15 నుండి 26 వరకు నిర్వహించే సరస్వతి పుష్కరాలకు ప్రణాళిక బద్దంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పుష్కరఘాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. గోదావరి నదిలోకి వెళ్ళడానికి అనువుగా తాత్కాలిక రోడ్డు నిర్మించాలని తెలిపారు. వీఐపీ ఘాట్ నుండి పుష్కర ఘాట్లను అనుసంధానం చేసే విధంగా తాత్కాలిక రోడ్డు నిర్మించాలని తాత్కాలిక రోడ్డు నిర్మాణానికి రైతులను సంప్రదించి పుష్కారాల వరకు రహదారి నిర్మాణానికి అవకాశం ఇచ్చే విధముగా చర్యలు తీసుకోవాలని సూచించారు.పుష్కరాలకు పెద్ద ఎత్తున భక్తులు వాహనాలలో వచ్చే అవకాశం ఉంటుందని పార్కింగ్ సౌకర్యం కల్పించాలని తెలిపారు.వీఐపీ ఘాట్ వద్ద ఉన్న రోడ్డును సైతం విస్తరణ చేయాలని రైతులతో మాట్లాడి రెండు వైపులా వాహ నాలు వెళ్లేందుకు తాత్కాలిక రోడ్డు నిర్మాణం చేపట్టాలని తెలి పారు. గోదావరి నది ప్రమాదాలు జరగకుండా ప్రమాదం హెచ్చరి కల సూచిక బోర్డులతో కూడిన ఇనుప పెన్షింగ్ ఏర్పాటు చేయాలని, గజ ఈత గాళ్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఆర్ అండ్ బి నుండి గంగారం క్రాస్, కాళేశ్వరం వరకు రోడ్డును మరమ్మత్తు చేసి అందుబాటులోకి తేవాలని, ప్రమాదాలు జరగ కుండా సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహణకు తాత్కాలికంగా పారిశుద్య ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం తాత్కాలిక బస్ స్టాండ్ ఏర్పాటు స్థలం, విఐపి ఘాట్, ప్రధాన ఘాట్ నుండి విఐపి ఘాట్ వరకు రహదారి నిర్మాణం, మెయిన్ రోడ్డు నుండి ఘాట్ వరకు రెండు వరుసల రహదారి నిర్మాణం చేపట్టే పనులను పరిశీలించారు.ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఎఎస్పీ బోనాల కిషన్, డిపిఓ నారా యణ రావు, జిల్లా వైద్యాదికారి డాక్టర్ మధుసూదన్, పీఆర్ ఈ ఈ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్,ఆర్ అండ్ బి,విద్యుత్ శాఖల అధికా రులు, ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now