అతిధి అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలని మంత్రి శ్రీధర్ బాబుకు వినతి
కాటారం, తెలంగాణజ్యోతి ప్రతినిధి: ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో పని చేస్తున్న అతిథి అధ్యాపకుల సమస్యలపై ఐ టీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబును కలిసి వినతిపత్రం అందజేశారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండ లంలో గురువారం ఒక కార్యక్రమానికి హాజరైన ఐటీ మంత్రి శ్రీధర్ బాబును అతిథి అధ్యాపకులు కలిసి వివరించారు. ఇందులో ప్రధానంగా టీజీపీఎస్సీ ద్వారా నియమించబడే జూనియర్ లెక్చరర్ పోస్టులతో సంబంధం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న అతిధి అధ్యాపకులను కొనసాగిస్తూ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా గౌరవ వేతనాన్ని పెంచాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పిస్తూ, ఎంటిఎస్ చేయాలని విన్న విస్తూ వినతి పత్రం అందజేశారు. ఈ విషయంపై మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ మీకు తప్పకుండా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని అధ్యాపకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభు త్వ జూనియర్ కళాశాల మహాదేవపూర్, భూపాలపల్లి కళాశా లలకు చెందిన అతిధి అధ్యాపకులు సమ్మయ్య, కర్ణాకర్, శైల జ, నాగలక్ష్మి, పోచయ్య, సిద్ధం పిన్నయ్య పటేల్ పాల్గొన్నారు.