రిపబ్లిక్ డే లక్ష ఉత్తరాల ప్రోగ్రాం
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ధర్మసమాజ్ పార్టీ అధినేత డాక్టర్ విశారధన్ మహారాజ్ ఆదేశాల మేరకు లక్ష ఉత్తరాల కార్యక్రమాన్ని శుక్రవారం కాటారం లో నిర్వహిం చారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కి, ఉత్తరం రాశారు. జనవరి 26న జాతీయ జెండా ఆవిష్కరణలో తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా అంబేడ్కర్ గారి చిత్రపటం, భారత రాజ్యాంగ పుస్తకం (చిత్రపటం) ని, ప్రతిరోజు విద్యా సంస్థలలో విద్యార్థులు చదివే ప్రార్థన స్థానం లో “భారత రాజ్యాంగ” పీఠిక ను ప్రతిజ్ఞ గా, చదివించాలని, ప్రభుత్వం జీవో విడుదల చేయాల ని కోరారు. శుక్రవారం ఉదయం కాటారం పోస్ట్ ఆఫీస్ లో 300 ఉత్తరాలు పోస్టు చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మసమాజ్ పార్టీ మంథని నియోజక వర్గ నాయకులు చిట్యాల శ్రీనివాస్ , కాటారం మండల అధ్యక్షులు కోరాల్ల శ్యామ్ , ఉపాధ్యక్షులు పంగ మహేష్, మండల ప్రధాన కార్యదర్శి మంతెన రవీందర్, బూడిదపల్లి గ్రామ అధ్యక్షుడు లింగాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.