హైవేపై వర్షాలతో కూలిన చెట్లను తొలగింపు

హైవేపై వర్షాలతో కూలిన చెట్లను తొలగింపు

హైవేపై వర్షాలతో కూలిన చెట్లను తొలగింపు

తాడ్వాయి, జులై2, తెలంగాణ జ్యోతి: మండల వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో వృక్షాలు రహదారులపై కూలిపోతున్నా యి. దీనివల్ల ప్రయాణికులకు, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన తాడ్వాయి ఎస్‌ఐ శ్రీకాంత్ రెడ్డి పోలీస్ సిబ్బందితో వెంటనే స్పందించారు. మంగళవారం, బుధవారం జాతీయ రహదారిపై కూలిన చెట్లను కట్టర్ మెషిన్ సాయంతో తొలగించారు. జలగలంచ కాజ్ వే వద్ద కోతకు గురవుతున్న రోడ్డును పరిశీలించి, మరమ్మతులపై పలు సూచనలు చేశారు. ప్రమాద ప్రాంతాల్లో రిప్లేటింగ్ స్టిక్కర్లు, సూచికల బోర్డులు ఏర్పాటు చేయించారు. వాహనాల ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా రాత్రి, పగలు తేడా లేకుండా చెట్లను తొలగించే పనులను చేపట్టారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్న ఎస్‌ఐ శ్రీకాంత్ రెడ్డికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది సత్యనారాయణ, పూజారి రమేష్, సాంబయ్య, వెంకట్, రజినీకర్‌తో పాటు పలువురు యువకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment