రేగొండ మండల ఆర్యవైశ్య సంఘం ఎన్నిక

రేగొండ మండల ఆర్యవైశ్య సంఘం ఎన్నిక

రేగొండ మండల ఆర్యవైశ్య సంఘం ఎన్నిక

కాటారం, ఆగస్ట్ 12, తెలంగాణ జ్యోతి : రేగొండ మండల ఆర్య వైశ్య సంఘం ఎన్నికలు మంగళవారం నిర్వహించారు. రేగొండ మండల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులుగా తనుకు రాజయ్య ఎన్నికయ్యారు. ఒక్కరే నామినేషన్ వేయడం తో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు. వైశ్య సంఘం నాయకులు మద్ది లక్ష్మీ నరసింహమూర్తి, జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి తనుకు శ్రీనివాస్ లు ప్రకటించారు. నూతన అధ్యక్షులుగా ఎన్నికైన తనకు రాజయ్య చే భూపాలపల్లి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు పవిత్రం శ్రీనివాస్ ప్రమాణస్వీకారం చేయించారు. అధ్యక్షులు తనుకు రాజయ్య మండల కార్యవర్గాన్ని ప్రకటించారు. ప్రధాన కార్యదర్శిగా జూలూరి గోవర్ధన్, కోశాధికారిగా గోరంట్ల వీరన్న , ఆర్య వైశ్యయూత్ అధ్యక్షుడు గా అయిత నరేష్, ప్రధాన కార్యదర్శి కల్లూరి వీరేష్, కోశాధికారి గోరింటల శ్రవణ్ లు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. కమిటీ సభ్యులందరికీ నూతన అధ్యక్షులు తణుకు రాజయ్య పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్నికల అధికారులను మండల వైశ్య సంఘం నూతన కార్యవర్గం శాలువాతో సత్కరించారు కొత్తగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ను తాజా మాజీ అధ్యక్షులు మాధురి ముక్తేశ్వర్ శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా మహిళా అధ్యక్షురాలు నరేంద్రుల ధనలక్ష్మి,మాజీ అధ్యక్షులు మడూరి ముక్తేశ్వర్, ఆకుల శ్రీనివాస్, శ్రీరాం రమేష్, కొమురవెల్లి సంతోష్, ఏర్రం సదాశివూ మండలంలోని ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment