రేణుక ఎల్లమ్మ దేవాలయం పునఃనిర్మాణం
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : జయశంకర్ భూపాల పల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో నిర్మిస్తున్న శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి ఆలయ నిర్మాణం పున ప్రారంభం పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ కాంట్రాక్టర్ కామిడి వెంకట్ రెడ్డి ఆలయ నిర్మాణం కోసం తనవంతు సాయంగా సిమెంట్ బస్తాలు అందజేయడం జరిగింది. ధన్వాడ గ్రామ గౌడ సోదరుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ వెంకట రెడ్డి నీ శాలువాతో చిరు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చీటూరు రాజలింగు గౌడ్, మార్క రవి గౌడ్, మారగోని రాజబాపు గౌడ్, మరగోని గణపతి గౌడ్, కరెంగల వెంకట రాజం గౌడ్, బొడిగే గిరీష్ గౌడ్, చీకట్ల వెంకటేష్ గౌడ్, చీటురీ మహేష్ గౌడ్, చిటూరి రాజేష్ గౌడ్ బుర్రి సుధాకర్ గౌడ్, చీకట్ల సుధాకర్ గౌడ్, పల్లె శ్రీకాంత్ గౌడ్, చల్లా వెంకట్ రెడ్డి, బోడ నరేష్, తొగరి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.