రంగవల్లులు, ముత్యాల ముగ్గులు. 

రంగవల్లులు, ముత్యాల ముగ్గులు. 

– నూతన సంవత్సరానికి స్వాగత సన్నాహాలు 

వెంకటాపురం తెలంగాణ జ్యోతి ప్రతినిధి : నూతన సంవత్స రానికి స్వాతం పలుకుతూ అశేష జనావళి ముత్యాల ముగ్గులు, రంగవ ల్లులతో ఇల్లు వాకిళ్లలో స్వాగత సన్నహాలతో అందంగా అలంకరిం చి ఆహ్వానం పలికారు. సోమవారం నూతన సంవత్స రం 2024 కు స్వాగతం పలుకుతూ గుడ్ బై 2023 అంటూ ఇల్ల వాకిళ్ళ ముందు రంగ రంగుల ముగ్గులతో ఆహ్వాన పలుకుతూ గృహాలు,ఇల్లు, వాకి ళ్ళతో స్వాగతం పలుకుతూ ముగ్గులను అందంగా అలంకరించి స్వాగత సన్నహాలతో పాల్గొన్నారు. అలాగే నూతన సంవత్సర స్వాగతం పలుకుతూ అనేక గ్రామాల్లో గ్రామ, గ్రామాన యువత గ్రామస్తులు ముత్యాల ముగ్గులు,రంగవల్లులతో ఆహ్వానం పలుకు తూ ముగ్గులతో భాజా భజాత్రీలతో స్వాగతం పలికేందుకు ఏర్పా టు చేశారు. ఆభాల గోపాలం, గ్రామీణ యువత యువతులు, నూతన సంవత్సర స్వాగతం పలికేందుకు స్వాగతం సన్నాహాలు కార్యక్రమాలు లో నిమగ్నమయ్యారు. మారుమూల ఏజెన్సీ ప్రాంత మైన వెంకటాపురం, వాజేడు మండలాల్లో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్ని అంటాయి. శుభాకాంక్షలు వేడుక లకు స్నేహితులు యువతరం నూతన సంవత్సర కేక్ కటింగ్ లతో స్వాగతం పలికేందుకు, అర్ధరాత్రి వేడుకలకు సన్నద్ద మయ్యారు. అలాగే పోలీస్ శాఖ హెచ్చరికల ప్రకారం మద్యం సేవించి వాహనా లు నడపరాదని, ప్రమాదాలకు గురై జీవితాలను పాడు చేసుకోవ ద్దని హెచ్చరికలు జారీ చేయడంతో, కుటుంబాల పెద్దల హెచ్చరిక లతో గ్రామీణ యువత జాగ్రత్తలతో ప్రధాన రహదారులపై వాహనా లతో కాకుండా కాలి నడక తో స్నేహితులతో నూతన సంవత్సర వేడుకలు జరుపు కుంటామని, తల్లిదండ్రుల అనుమతులతో వేడుకలకు వెళ్లినట్లు పలువురు తెలిపారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “రంగవల్లులు, ముత్యాల ముగ్గులు. ”

Leave a comment