ఈదురు గాలులతో కూడిన వాన

ఈదురు గాలులతో కూడిన వాన

ఈదురు గాలులతో కూడిన వాన

– కూలిపోయిన ఇల్లు

తెలంగాణజ్యోతి,సెప్టెంబర్2,కన్నాయిగూడెం:మండలంలోని చింతగూడెం గ్రామానికి చెందిన గజ్జల సారయ్య ఇల్లు భారీ గాలివానకు కూలిపోయింది. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షం ఈదురు గాలులు రావడంతో రేకులు మొత్తం కొట్టుకు పోయాయి. ఇళ్లు కూలిపోవడంతో ఉండడానికి నిలువ నీడ లేకుండా పోయిందని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. భారీ ఈదురు గాలులకు తమ ఇంటిపై రేకులు ఎగిరి పడుతున్న శబ్దం రావడంతో సారయ్యతోపాటు కుటుంబ సభ్యులంతా బయటకు పరుగుతీశారు. ఈ సందర్భం లో కావిరి రాజక్క అనే మహిళ నడుము మీద ఎగిరిపడిన రేకులు వచ్చి పడ్డాయి. గజ్జల సారక్క చేయికి సల్ప గాయాలు అయ్యాయి. కాగా, ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని, వీరి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని గ్రాస్థులు కోరారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment