ఎంబీబీఎస్ చదువు కోసం పుట్ట మధు ఆర్థిక సహాయం
– జ్యోత్స్నకు రూ.2లక్షల చెక్కును అందించిన కేటీఆర్
కాటారం, జూలై 27, తెలంగాణ జ్యోతి : కాటారం మండల కేంద్రానికి చెందిన గంట జ్యోత్స్న ఎంబీబీఎస్ కోర్సు పూర్తయ్యే వరకు ఖర్చులు భరిస్తానని మాట ఇచ్చిన మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ తన మాట నిలబెట్టుకున్నారు. రెండు రోజుల క్రితం భీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకల్లో బాగంగా గిఫ్ట్ ఏ స్మైల్ ద్వారా ఏడాదికి ఖర్చు అయ్యే రూ.2లక్షల సాయం అందిస్తానని జ్యోత్స్న కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో ఆదివారం భూపాలపల్లి జిల్లా మొగుళ్ళ పల్లి మండలం ఇస్సిపేట గ్రామంలోనీ శ్రీ లక్ష్మీ సాయి గార్డెన్ లో గంట జ్యోత్స్నకు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా రూ.2లక్షల చెక్కు అందజేశారు. మాట ఇచ్చి తన భవిష్యత్‌కు బంగారు బాట వేసిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్, బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులకు జ్యోత్స్న కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మాజీ జిల్లాపరిషత్ చైర్మెన్ జక్కు శ్రీహర్షిణి- రాకేష్, మండల శాఖ అధ్యక్షులు జోడు శ్రీనివాస్, రామిళ్ళ.కిరణ్, గాలి సడవళి, కొండగోర్ల వెంకట స్వామి, జక్కు.శ్రావణ్, నరివేద్ది.శ్రీనివాస్, వంగల రాజేంద్రాచారి, చీమల వంశీ, గుండ్లపల్లి.అశోక్ ఉప్పు.సంతోష్, శ్రీరాముల, రజినీకాంత్, గాజుల విక్రమ్, ప్రమోద్, జాడి శేఖర్ పాల్గోన్నారు.