వెంకటాపురం మండలంలో ప్రజా పాలన గ్రామసభలు
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో మంగళవారం గ్రామపంచాయతీ కార్యాలయాలలో ప్రజా పాలన గ్రామసభలు నిర్వహించారు. మొదటి రోజు మండలంలోని 18 పంచాయతీలకు 8 పంచాయతీలలో గ్రామసభలు నిర్వహిం చారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకం, ఇంకా అనేక సంక్షేమ పథకాలపై అర్హులైన లబ్ధిదారుల ఎంపికకై ప్రజల వద్ద నుండి దరఖా స్తులను స్వీకరించారు. రాచపల్లి పంచాయతీలో నిర్వహించిన గ్రామసభలో మండల తాసిల్దార్ ఎం. లక్ష్మీరాజయ్య, మండల వ్యవసాయ అధికారి, రెవిన్యూ మరియు పంచాయతీరాజ్ అధికా రులు పాల్గొన్నారు. అలాగే వి ఆర్ కె పురం, బెస్తగూడెం, మరికాల, తిప్పాపురం గ్రామాలలో గ్రామసభలు ప్రారంభమయ్యాయి. ఆయా గ్రామసభలకు వివిధ శాఖల అధికారులు పంచాయ తీ కార్యదర్శులు అంగన్వాడి టీచర్లు, రెవెన్యూ, పోలీస్, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేంద్రప్రసాద్ మండల పంచాయ తీ అధికారి, ప్రత్యేక అధికారులు గ్రామ సభలలో పాల్గొన్నారు.