మీడియాపై సినీ నటుడు మోహన్ బాబు దాడికి వెల్లువెత్తిన నిరసన
– తహాసిల్దార్ కి, పోలీసులకు వినతి పత్రాలు
– జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు, వారి అనుచరులు మీడియాపై విచక్షణారహితంగా దాడి చేయటాన్ని, జర్నలిస్టు సంఘాలు, రాజకీయ పార్టీలు ఖండించారు. ఈ మేరకు ములుగు జిల్లా వెంకటాపురం మండలకేంద్రంలో బుధవారం ప్రింట్ అండ్ ఎల క్ట్రానిక్ మీడియా మిత్రులు సంయుక్తంగా నల్లబ్యాడ్జీలు ధరించి మోహన్ బాబు దాడిని తీవ్రంగా ఖండించారు. వెంకటాపురం పట్టణ ప్రధాన వీధులలో ఫ్లెక్సీలతో మోహన్ బాబుపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, భవిష్యత్తులో విధి నిర్వాహణలో ఉన్న వారిపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం జర్నలి స్టులపై దాడులకు పాల్పడే వారిపై చర్యలు తీసుకునేలా అసెంబ్లీలో ప్రత్యేక బిల్లు, చట్టాలు తీసుకువచ్చి మీడియాకు రక్షణ కల్పించాలని మీడియా ప్రతినిధులు డిమాండ్ చేశా రు. అనంతరం మండల తహాసిల్దార్, పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్ట ర్కు మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు, అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వినతి పత్రం అందజేశారు.ఈకార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్య క్షులు సయ్యద్ హుస్సేన్, పిఎసిఎస్ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు చిడెం మొహన్ రావు, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు గంపా రాంబాబు, సిపిఎం నాయకులు కుమ్మరి శ్రీను, కట్ట నరసింహ చారి, భారతీయ జనతా పార్టీ నాయకులు రామేళ్ళ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. టి.యు.డబ్లు.జె. ఐ.జే.యు. (హెచ్. 143). జాతీయ కౌన్సిల్ సభ్యులు బాచి నేని ప్రవీణ్ పాల్గొని, మోహన్ బాబు దాడిని తీవ్రంగా ఖండించారు. వారితో పాటు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న రాజకీయ పార్టీ నాయకులు సైతం, మీడియాతో మాట్లాడుతూ దాడికి పాల్పడిన మోహన్ బాబు పై వివిద సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాత్రికేయు లు, సంఘాల నాయకులు, పార్టీలకు అతీతంగా , పెద్ద ఎత్తు న జర్నలిస్టుల ఆందోళనకు నిరసన కార్యక్రమానికి సంఘీ భావం ప్రకటించారు.