హిందూ సమ్మేళనం కోసం నవధాన్యాల తయారీ వేగవంతం
ములుగు, ఏప్రిల్ 6 తెలంగాణ జ్యోతి: ఏప్రిల్ 18న ములుగులో భారీ స్థాయిలో నిర్వహించబోయే విరాట్ హిందూ సమ్మేళనం ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ క్షేత్రం ఆలయంలో నవధాన్యాల ప్యాకెట్ల తయారీ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా ప్రారంభించారు. హోమ పూజలో వినియోగించేందుకు సుమారు 10 వేల నవధాన్యాల పొట్లాలను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుని మహిళలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ ధాన్యపు ప్యాకెట్లను మహిళల ద్వారా ప్రతి ఇంటికీ పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సమ్మేళనం రోజున శ్రీశ్రీశ్రీ కమలనంద భారతి స్వామి ఆధ్వర్యంలో నిర్వహించబడే హోమ పూజలో ఈ నవధాన్యాలను వినియోగించనున్నారు. కార్యక్రమం ద్వారా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పడమే కాకుండా, భక్తుల్లో భక్తి భావాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో నిర్వాహకులు కృషి చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళన సభ అధ్యక్షులు గండ్రకోట కుమార్, దిడ్డి రాజ్ కుమార్‌తో పాటు ఎలుక తుర్తి విజయ, నవ్య, శంకేసి పల్లవి, జెల్ల అనిత, రజిత, పౌడాల వనమాల, ఆకుల స్వరూప, భూషవేన రజిత, ఇమ్మడి మమత, నగరవేన కొమురక్క, నంద్రే చైత్రశ్రీ, గంధం సులోచన, శ్రీరాముల రజిత, అగ్గిమెట్ల సుమతి, కుడుముల కవిత, తనుగుల వినోద, పౌడాల వెన్నెల తదితరులు పాల్గొన్నారు.









