ములుగు శ్రీక్షేత్రంలో గోటి తలంబ్రాల తయారీ ప్రారంభం

On: March 23, 2026 5:02 PM

ములుగు శ్రీక్షేత్రంలో గోటి తలంబ్రాల తయారీ ప్రారంభం

ములుగు శ్రీక్షేత్రంలో గోటి తలంబ్రాల తయారీ ప్రారంభం

ప్రతిరోజు భక్తులు పాల్గొనాలని ఆలయ కమిటీ పిలుపు

ములుగు, మార్చి 23, తెలంగాణ జ్యోతి: ములుగు పట్టణంలోని శ్రీక్షేత్రం దేవస్థానంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని గోటి తలంబ్రాల తయారీ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు గోటి తలంబ్రాల తయారీ కొనసాగనుందని కమిటీ అధ్యక్షులు గండ్రకోట కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చింత నిప్పుల చంద్రకళ, 9వ వార్డు కౌన్సిలర్ గండ్రకోట వాణి, 18వ వార్డు కౌన్సిలర్ బైకాని అనూష, కొత్తపల్లి జ్యోతి, శంకేసి పల్లవి, గంధం రామ, కాపిడి లక్ష్మి, సూర లావణ్య, పొడిచేటి సీత పాల్గొన్నారు. అలాగే ఆలయ కమిటీ సభ్యులు కొత్తపల్లి బాబురావు, చింత నిప్పుల బిక్షపతి, బైకాని సాగర్, ఓదెల రమేష్, సల్పాల శ్రీను, ఎలుక తుర్తి రాజన్న, గంధం విజేందర్, కొత్తకొండ రమేష్, కాపిడి ప్రభాకర్, ఇమ్మడి రాకేష్ యాదవ్, బైకాని మోహన్, సూర రఘు, గాదె రాజు, అక్కినపల్లి ఓం ప్రకాష్, సూర ప్రభాకర్, బైకాని రాజశేఖర్, శంకేసి జగదీష్, గుర్రం సాయి, చిట్టి చరణ్, బత్తుల అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!