కమనీయంగా కొనసాగిన నగర సంకీర్తన

కమనీయంగా కొనసాగిన నగర సంకీర్తన

కమనీయంగా కొనసాగిన నగర సంకీర్తన

– హనుమాన్ భక్తమండలి ఆధ్వర్యంలో నిర్వహణ

తెలంగాణ జ్యోతి, ములుగు ప్రతినిధి : హనుమాన్ భక్త మండలి ఆధ్వర్యంలో ములుగు జిల్లా కేంద్రంలో శ్రీ రామాలయ ప్రాంగణం నుండి సభ్యులు హనుమాన్ సంకీర్తన లను కీర్తిస్తూ, చాలీసా పారాయణం చేస్తూ ఆధ్యాత్మిక భక్తి గేయాలు, కోలాటాలతో శనివారం నగర సంకీర్తన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో హనుమాన్ కు అభిషేకం నిర్వహించారు. ఉదయం 7:35 గంటల నుంచి 11: 30 గంటల వరకు 4 గంటల పాటు నిర్వహించిన నగర సంకీర్తన కార్యక్రమంలో హనుమాన్ భక్తమండలి సభ్యులు, పలువురు హిందూ బంధువులు స్వచ్ఛందంగా ఎంతో ఆసక్తితో పాల్గొన్నారు. గ్రామంలోని పుర వీధులు గుండా “శ్రీరామ జయరామ జయజయరామ”, ” శ్రీ హనుమ జై హనుమ జయ జయ హనుమ” అంటూ గ్రామంలో నగర సంకీర్తన కొనసాగగా భక్తి భావ గీతాలతో వీధులు మారుమోగాయి. నగర సంకీర్తనకు స్త్రీలు మంగళ హారతులతో స్వాగతం పలికి నీల్లార పోశారు. హనుమాన్ భక్త మండలి సభ్యులు మాట్లాడుతూ నగర సంకీర్తనకు వివిధ రకాలుగా సహకరించిన దాతలకు ఆ భగవంతుని కృప కటాక్షాలు వారికి, వారి కుటుంబానికి కలగాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్వాములు ఇమ్మడి రమేష్, తుమ్మ రామకృష్ణ, కొనుపుల కుమార్, ఆవుల ప్రశాంత్ రెడ్డి, పేర బోయిన శ్రీధర్,  కొండి మహిపాల్, బైకాని నటరాజ్, ఒజ్జల కుమార్, హను మాన్ మాలాధారణ స్వాములు, రామాలయ కమిటీ సభ్యులు, భక్తులు, హిందూ బంధువులు పాల్గొన్నారు. అనంతరం రామాలయ ప్రాంగణంలో హనుమాన్ స్వాములకు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment