వాజేడు బిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు

వాజేడు బిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు

వెంకటాపురం, జూలై 7, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరిగే ప్రజా నిరసనకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలిరాకుండా ఉండేందుకు అరెస్టులు చేయాలని జిల్లా ఉన్నతాధికారుల ఆదేశంపై వాజేడు మండల కేంద్రంలో బిఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను సోమవారం వేకువజామునే వాజేడు పోలీసుల అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను ప్రజల్లోకి, తీసుకెళ్లేందుకు ప్రజా నిరసన కార్యక్రమానికి వెళ్తున్న నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ లు చేయటం అప్రజా స్వామిక చర్యని,  కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ చర్యకు ఇది నిదర్శనమని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెరుమాళ్ళ రామకృష్ణారెడ్డి విమర్శించారు. ప్రజా నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకున్న, ప్రభుత్వం పై ప్రజల నిరసన సాగుతూనే ఉంటుందని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. వాజేడు పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసిన వారిలో మండల బిఆర్ఎస్ మండల అధ్యక్షులు పెనుమళ్ళ రామకృష్ణారెడ్డి, వాజేడు మండల యూత్ అధ్యక్షుడు మోడీగ తిరుపతి యాదవ్, వాజేడు మండల మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు గొంది రమణ రావు, ఎస్. సి. సెల్ వాజేడు మండల అధ్యక్షులు చెన్నం సాంబశివరావు,ఎస్. టి. సెల్ జిల్లా కార్యవర్గ సభ్యులు తల్లడి వెంకటేశ్వర్లు, వాజేడు గ్రామపంచాయతీ మాజీ ఉప సర్పంచ్ కల్లూరి సతీష్, పార్టీ మండల నాయకులు, చిరుమర్తి శ్రీనివాస్, పెనుమల్లు వెంకటరెడ్డి, మద్దూరి రవి, రాణి మేకల పవన్, ములకనూరి జీవన్, కేశ బోయిన బాలకృష్ణ, ఇంకా పలువురు కార్యకర్తలు నాయకులు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment