ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభ విజయవంతం
గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు : సర్పంచ్ గట్టి సుదర్శన్
ములుగు, ఏప్రిల్3, తెలంగాణ జ్యోతి: ములుగు మండలం కొత్తూరు గ్రామంలో నిర్వహించిన ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ గ్రామసభ ఉత్సాహ భరిత వాతావరణంలో విజయవంతంగా ముగిసిందని గ్రామ సర్పంచ్ గట్టి సుదర్శన్ తెలిపారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా నిర్వహించిన ఈ సభలో గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని తమ సమస్యలు, విన్నపా లను అధికారుల దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయ వంతం చేయడంలో సహకరించిన గ్రామ ప్రజలకు, వివిధ శాఖల అధికారులకు, సిబ్బందికి ఆయన పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే సహకారం కొనసాగించాలని, సమిష్టి కృషితో కొత్తూరు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.









