Prahlad | ములుగు బిజెపి అభ్యర్థిగా అజ్మీర ప్రహ్లాద్
తెలంగాణ జ్యోతి, ములుగు ప్రతినిధి : ములుగు నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా అజ్మీర ప్రహ్లాద్ ను మంగళవారం అధిష్టానం ప్రకటించింది. బిజెపి ప్రకటించిన మూడు లిస్టులలో ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పేరు లేకపోవడంతో బిజెపి నాయకులు, కార్యకర్తలలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు నాలుగో లిస్టులో బిజెపి అభ్యర్థిని ఖరారు చేయడంతో బిజెపి నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించడంతో నేటి నుంచి నియోజకవర్గంలో బిజెపి ప్రచారం మొదలుకానుంది.