చిన్నబోయినపల్లిలో మధ్యాహ్నం వరకు విద్యుత్ అంతరాయం
ఏటూరునాగరం, సెప్టెంబర్ 26, తెలంగాణ జ్యోతి : గత 2 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చిన్న బోయినపల్లి పోతరాజు బోరు సమీపంలోని విద్యుత్ స్తంభాలపై భారీ వృక్షాలు పడగా దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ శాఖ అధికారులు లైన్మెన్ మొగిలి, సాయి నేతృత్వంలో సిబ్బందితో మరమ్మత్తులు చేపట్టి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ ను పునరుద్ధరించారు. గ్రామ ప్రజలు అధికారులు పనితీరు వడ అభినందనలు తెలిపారు.