ఆరు గ్యారెంటీలతో అధికారం ‘హస్త’గతం

Written by telangana jyothi

Published on:

ఆరు గ్యారెంటీలతో అధికారం ‘హస్త’గతం

  • తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిల్ల శ్రీధర్ బాబు

తెలంగాణ జ్యోతి , కాటారం ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ స్కీములతో అధికారాన్ని చేజెక్కించుకుంటా మని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, ఏఐసీసీ కార్యదర్శి, మంథని శాసనసభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని బిఎల్ఎం గార్డెన్స్ లో మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై సుదీర్ఘంగా ప్రసంగించారు. మహిళలకు ప్రతినెల 25 వందల రూపాయలతో పాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణానికి ఉద్దేశించిన మహాలక్ష్మి పథకం మహిళల ఆదరణ పొందిందని దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం, చేయుత తదితర పథకాలతో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం వీస్తుందని, ప్రజల హర్షధ్వనుల మధ్య శ్రీధర్ బాబు తన ప్రసంగంలో వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను కచ్చితంగా అమలు చేసి తీరుతామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ చేయలేదని, టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలకు కల్లబొల్లి మాటలతో మభ్యపెడుతున్నారని విరుచుకుపడ్డారు. రాష్ట్ర సంపాదన పక్కదారి పట్టించి, ప్రజా సంక్షేమాన్ని విస్మరించారని ఘాటుగా విమర్శించారు. ప్రజా శ్రేయస్సు కోసం అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని, ప్రజల ఆదరాభిమానాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయనిడానికి ఇక్కడికి వచ్చిన ప్రజలే నిదర్శనం అని శ్రీధర్ బాబు అన్నారు. మంథని నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ఏడాదిలోగా పూర్తి చేస్తామని దుద్దిల్ల శ్రీధర్ బాబు హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. కొంతమంది చదువురాని మూర్ఖులు ఇష్టానుసారంగా సోషల్ మీడియాలలో ప్రచారాన్ని చేపట్టి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని, వారు తమ పద్ధతులను మార్చుకోకపోతే ప్రజలే వారికి గుణపాఠం చెబుతారని హెచ్చరికలు జారీ చేశారు. ప్రజల మద్దతుతో, ప్రజల ఆదరాభిమానాలతో ప్రజాప్రతినిధులు నాయకులు పనిచేయాలని హితవు పలికారు. సంక్షేమం, అభివృద్ధి అనేది తమకు రెండు కళ్ళు లాంటివని శ్రీధర్ బాబు వెల్లడించారు. మర్డర్లు చేసే రాజకీయాలు కావాలా, సంక్షేమం, అభివృద్ధి కావాలా అంటూ ప్రజలను ప్రశ్నించి సమాధానాన్ని రాబట్టారు. పేద ప్రజల అభివృద్ధి కోసం తాము, తమ తండ్రి శ్రీపాదరావు మంథని ప్రాంతానికి ఎనలేని కృషి చేశామని ఆయన విస్పష్టంగా వివరించారు. మంథని నియోజకవర్గం లో విద్యా, వైద్య రంగాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పేదలకు అందుబాటులో ఉంచామని, రానున్న రోజుల్లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామని, బి ఫార్మసీ కాలేజీ వాటితో పాటు నర్సింగ్ కాలేజీ, నైపుణ్య శిక్షణ అభివృద్ధి సంస్థను సైతం ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పెద్ద పీట వేస్తామని శ్రీధర్ బాబు ప్రకటించారు. శ్రీధర్ బాబు రాక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున బాణాసంచా కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మహిళలు మంగళహారతులు, పూల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షత వహించగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐత ప్రకాశ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోట రాజబాబు గౌడ్, కాటారం, మహాదేవపూర్ మండల పరిషత్ అధ్యక్షులు పంతకాని సమ్మయ్య, బన్సోడ రానిబాయి, మహాముత్తారం జడ్పిటిసి లింగమల్ల శారద, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు వోన్న వంశవర్ధన్ రావు, డిసిసి ఉపాధ్యక్షులు గద్దే సమ్మిరెడ్డి, కుంభం సప్న, ఎంపీటీసీ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు జాడి మహేశ్వరి, యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీమల సందీప్, రాష్ట్ర పీసీ సెల్ మహిళా కార్యదర్శి ఆంగోతు సుగుణ, నాయకులు కొట్టే ప్రభాకర్, ఉప సర్పంచ్ నాయిని శ్రీనివాస్, కొట్టే శ్రీహరి ఎలుబాక సుజాత, తెప్పల దేవేందర్ రెడ్డి, అజ్మీరా రఘురాం, అంగాజాల అశోక్ కుమార్, అతుకూరి రాజయ్య, ఆకుల చంద్ర శేఖర్, అమీర్ ఖాన్, పలువురు సర్పంచులు ఎంపీటీసీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సెల్ నాయకులు పాల్గొన్నారు. మండల సింగిల్ విండో సొసైటీ డైరెక్టర్ చీమల సత్యంతోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు అలాగే చిధినేపల్లి, గూడూరు, గుమ్మలపల్లి, విలాసాగర్, మద్దెలపల్లి తదితర గ్రామాల నుంచి పలువురు టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now