సింగరేణి ఎన్నికల వాయిదా
భూపాలపల్లి ప్రతినిధి : తెలంగాణలో ఎలక్షన్ కమిషన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో సింగరేణి ఎన్నికలను హైకోర్టు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 28వ తేదీన జరగనున్న సింగరేణి ఎన్నికలు హైకోర్టు ఆదేశాలతో డిసెంబర్ 27వ తేదీకి సింగరేణి ఎన్నికలు వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణ చేపట్టిన హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది.