ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాలు సిద్ధం
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను అధికార యంత్రాంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం తాసిల్దార్ నాగరాజు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. కాటారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 273, 498 పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ టీచర్స్, గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నామని తాహసిల్దార్ నాగరాజు విలేకరులకు వివరించారు. పోలింగ్ కేంద్రాలలో దివ్యాంగులకు ర్యాంపు, విద్యుత్ సదుపాయం, ఫ్యాన్లు, మంచినీటి వసతి, మరుగుదొడ్లు తది తర సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టారు. ఆయన వెంట ఉప తహసిల్దార్ రామ్మోహన్ గౌడ్, గిర్ధావర్ వెంకన్న, పాఠశాల ప్రధానోపాధ్యా యురాలు సుజాత తదితరులు పాల్గొన్నారు.