Latest News
మా రెండేళ్ల పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం : సీఎం రేవంత్ రెడ్డి... సేవతీర్థ్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... కేసీఆర్‌ను కూడా ప్రజలు ఓడించారు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్... సృష్టి సంతానోత్పత్తి కుంభకోణంలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ... గొర్రెలు కాదు..! గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ట్రక్కుల్లో తరలింపు : హెడ్ మాస్టర్ సస్పెండ్... మున్సిపల్ ఫలితాల ఊపుతో... మార్చిలో పరిషత్‌ వార్‌!... ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి...    

పేకాట స్థావరంపై పోలీసుల దాడి : 4 గురి అరెస్ట్

On: March 17, 2026 8:12 PM

పేకాట స్థావరంపై పోలీసుల దాడి : 4 గురి అరెస్ట్

పేకాట స్థావరంపై పోలీసుల దాడి : 4 గురి అరెస్ట్

ములుగు, మార్చి 17 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా కేంద్రంలోని 5వ వార్డు పరిధిలోని ఓపెన్ ప్లాట్స్‌లో పేకాట ఆడుతున్న వారిపై ములుగు పోలీసులు దాడులు నిర్వహించారు. ఎస్సై యు. ఉపేందర్ రావు, 2వ ఎస్సై చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో నలుగురిని పట్టుకోగా ఒకరు పరారయ్యారు. పట్టుబడిన నలుగురు వద్ద నుంచి రూ.2,700 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పేకాట వంటి వ్యసనాలు యువతను అప్పులపాలు చేసి ఆత్మహత్యలు, కుటుంబ కలహాలకు దారితీస్తాయని  ఎస్సై ఉపేందర్ రావు అన్నారు. పేకాట, గంజాయి వంటి నిషేధిత కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం అందించే వారికి పారితోషికం అందజేస్తామని,  వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని వెల్లడించారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!