సునీత పట్ల పోలీసుల ఔదార్యం
– కృత్రిమ కాలు ఏర్పాటు – కృతజ్ఞతలు తెలిపిన సునీత కుటుంబం
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ఇటీవల మావోయిస్టులు అమర్చిన మందు పాతర ప్రమాదంలో కాలు కోల్పోయిన సునీత పట్ల పోలీసులు ఔదార్యం చూపించి కృత్రిమ కాలు ఏర్పాటుకు కృషి చేశారు. అటవి ఉత్పత్తుల సేకరణలో భాగంగా అడవిలో మావోయిస్టులు అమర్చిన మందు పాతర పేలి సునిత కాలు కోల్పోయింది. ఈ క్రమంలో సునీత పట్ల పోలీసు ఉన్నతాధికారుల ఆదేశం మేరకు వెంకటాపురం పోలీ సులు ప్రత్యేక చొరవ చూపి దాతల సహకారంతో సునీతకు కాలును అమర్చారు. వెంకటాపురం సి.ఐ బండారి కుమార్ కు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, భారతీ వికాస్ పరిషత్తు చారిటబు ల్ స్వచ్ఛంద సేవా సంస్థకు సునీత, కుటుంబ సభ్యులు కృతజ్ఞ తలు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట రావు ఆధ్వర్యంలో మంజూరు చేపిస్తామని కాంగ్రెస్ నాయకులు ఆమెకు మనోధైర్యం కల్పించా రు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, పీఏసీఎస్ అధ్యక్షులు చిడెం మోహన్ రావు, మద్దుకూరి ప్రసాద్, శ్రీరాముల రమేష్, జి.నాగేశ్వరరావు తదిత రులు పాల్గొన్నారు.