గారేపల్లిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

Written by telangana jyothi

Published on:

గారేపల్లిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

తెలంగాణ జ్యోతి, కాటారం : పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పోలీసులు శుక్రవారం సాయంత్రం గారేపల్లిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. డిఎస్పి రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సివిల్, సిఆర్పిఎఫ్ పోలీస్ జవాన్లతో కవాతు నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికలు సజావుగా సాగేందుకు పోలీసులకు ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా డిఎస్పి రామ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. చౌరస్తాతో పాటు పురవీధుల గుండా పోలీసులు కవాతు చేశారు. ఈ కార్యక్రమంలో కాటారం సిఐ నాగార్జున రావు, ఎస్సై మ్యాక అభినవ్, అదనపు ఎస్సైలు, సి ఆర్ పి జవాన్లు పాల్గొన్నారు.

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now