నిరుపేద కుటుంబానికి పోలీసుల ఆర్థిక సహాయం
వెంకటాపూర్, జూలై 11, ప్రజాతంత్ర : వెంకటాపూర్ మండలం లోని లక్ష్మీదేవిపేట గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి పోలీసు శాఖ సానుభూతి చాటింది. గ్రామానికి చెందిన మహమ్మద్ రజియా కుటుంబాన్ని వెంకటాపూర్ డిఎస్పీ రవీందర్ స్వయంగా పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇటీవల రజియా రెండో కుమారుడు చాంద్ పాషా అనారోగ్యంతో మృతిచెందడం వల్ల ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని గుర్తించిన పోలీసులు, వారి పట్ల మానవతా దృక్పథంతో ముందుకొచ్చారు. డిఎస్పీ రవీందర్ 50 కేజీల బియ్యంతో పాటు రూ.2 వేల నగదును ఆ కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ సేవే మాకు ధ్యేయం సామాజిక బాధ్యతగా మానవత్వంతో ఈ కుటుంబానికి సహాయం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై చల్ల రాజుతో పాటు పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.