వెంకటాపురం ఎంపీడీవోగా పొదిలి శ్రీనివాస్ బాధ్యతలు స్వీకారం
వెంకటాపురం, అక్టోబర్ 8, తెలంగాణ జ్యోతి : వెంకటాపురం మండల ప్రజా అభివృద్ధి అధికారిగా (ఎంపీడీవో) పొదిలి శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ఎంపీడీవో రాజేంద్ర ప్రసాద్ అనారోగ్య కారణంగా సెలవుపై వెళ్లడంతో ములుగు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంగపేట మండల పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న పొదిలి శ్రీనివాస్ ను వెంకటాపురం ఎంపీడీవోగా నియమించారు. బుధవారం ఆయన అధికారికంగా కొత్త బాధ్యతలు చేపట్టారు. అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు శ్రీనివాస్ కు అభినందనలు తెలిపారు.