ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి కనిపిస్తే సమాచారం ఇవ్వండి
– కన్నాయిగూడెం ఎస్సై వెంకటేష్
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టయిగూడెం గ్రామానికి చెందిన కుమ్మరి హరిబాబు ఈ నెల 2న ఇంట్లో నుండి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడని కన్నాయిగూడెం ఎస్సై వెంకటేష్ మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంట్లో తగాదాలతో పారిపోయాడని పేర్కొన్నారు. సదరు వ్యక్తి ఎవరికైనా ఎక్కడైనా కనిపిస్తే కన్నాయిగూడెం పీఎస్ నంబర్కు 8712670139 సమాచారం ఇవ్వాలని కోరారు.