మద్యం షాపుల ఏర్పాటుకు 3 పంచాయతీలలో పీసా గ్రామ సభల ఆమోదం

మద్యం షాపుల ఏర్పాటుకు 3 పంచాయతీలలో పీసా గ్రామ సభల ఆమోదం

మద్యం షాపుల ఏర్పాటుకు 3 పంచాయతీలలో పీసా గ్రామ సభల ఆమోదం

వెంకటాపురం, జూలై 26, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని బీసీ మర్రిగూడెం, వీఆర్‌కే పురం, వెంకటాపురం పంచాయతీల్లో మద్యం షాపుల ఏర్పాటుకు పీసా గ్రామ సభలు ఆమోదం తెలిపాయి. 2025–2027 ఎక్సైజ్ సంవత్సరానికి గిరిజన ప్రాంతాల్లో మద్యం షాపుల నియంత్రిత అనుమతుల కోసం జిల్లా ఉన్నతాధికారులు ఇచ్చిన మార్గ దర్శకాల మేరకు ఈ గ్రామ సభలు నిర్వహించారు. గిరిజనుల అభిప్రాయాన్ని అనుసరించి షాపులు ఏర్పాటు చేయాలన్న నిబంధనలతో ఆయా పంచాయతీ కేంద్రాల్లో పీసా గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజల అభిప్రాయాన్ని నమోదు చేశారు. వీఆర్‌కే పురం, వెంకటాపురం గ్రామాల్లో ఇప్పటికే మద్యం షాపులు ఉన్నప్పటికీ, భవిష్యత్ ఎక్సైజ్ సంవత్సరానికి పునఃఆమోదం తీసుకున్నారు. ఇక నూతనంగా బీసీ మర్రిగూడెం, నూగూరు పంచాయతీల్లో షాపుల ఏర్పాటుకు గ్రామ సభలు నిర్వహిం చాల్సి ఉంది. అయితే నూగూరు పంచాయతీలో పీసా గ్రామ సభ కోరం లేకపోవడంతో అధికారులు సభను వాయిదా వేశారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేంద్రప్రసాద్, మండల పంచాయతీ అధికారి కే.సురేష్, ఆయా పంచాయతీల కార్యద ర్శులు, పీసా ఉపాధ్యక్షులు, మొబిలైజర్లు, గిరిజన ఓటర్లు ఈ సభలలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment